![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -321 లో..... కార్తీక్, ప్రమీల గురించి శకుంతల తప్పుగా మాట్లాడుతుంది. కార్తీక్ తో ప్రమీల క్లోజ్ గా ఉండడానికి కారణం తన కళ్ళు తన కళ్ళు బాగుండాలని వంటలు చేసుకొని ఇచ్చేది. కళ్ళని మాత్రమే ఆరాధించేదని కార్తీక్ చెప్తాడు. ప్రమీల తప్పుగా ప్రవర్తించందని చెప్తే ఇలా మాట్లాడుతావు ఏంటని శకుంతల కోప్పడుతుంది. చెప్తున్నా కదా అంతా ఆ కళ్ళ కోసమే అని రుద్ర అనగానే ఆ కళ్ళు ఉంటే ఎంతా పోతే ఎంత అని శకుంతల అనగానే అత్తయ్య గారు ఆ కళ్ళని ఏం అనొద్దు ఎందుకు అంటే అవి భాను గారి కళ్ళు అని ప్రమీల అనగానే అందరు షాక్ అవుతారు.
అంటే భాను కళ్ళు డొనేట్ చేసింది అతనికేనా అని పెద్దసారు అనగానే అవును అందుకే అతనికి మార్ట్ లో జాబ్ ఇచ్చారని గంగ చెప్తుంది. దాంతో శకుంతల ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత భాను ఫోటో దగ్గరికి వెళ్లి శకుంతల బాధపడుతుంది. ఈ రోజు నీ కళ్ళని బాధపెట్టానని అంటుంటే అప్పుడే పెద్దసారు వస్తాడు. నువ్వు ప్రమీల విషయం లో తొందరపడ్డావ్ అందుకే ఆవేశం తగ్గించుకోమని చెప్పేది అని పెద్దసారు అంటాడు. మరొకవైపు లక్ష్మి, పైడిరాజు కోసం గంగ చేపల పులుసు తీసుకొని వెళ్తుంది. అక్కడ లక్ష్మిని జయ డైనింగ్ టేబుల్ దగ్గర తక్కువ చేసి మాట్లాడుతుంటే గంగ వచ్చి తన చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే సుధా వచ్చి ఏమైందని అడుగుతుంది.
నేను ఏం అనలేదని జయ అంటుంది. లేదు అమ్మ మా అమ్మని తక్కువ చేసి మాట్లాడిందని గంగ చెప్తుంది జయ నువ్వు లక్ష్మీకి సారీ చెప్పమని సుధా అనగానే అందరు వాళ్లకే సపోర్ట్ అని డ్రామా ప్లే చేస్తుంది. ఆ తర్వాత ప్రమీల జరిగిన దానికి బాధపడుతుంది. నాకు ఎందుకు బావ గారు సూపర్ మార్కెట్ బాధ్యతలు అప్పగించారు. ఇంట్లో ఉంటే ఇవన్నీ ఏం ఉండేవి కావని ప్రమీల అంటుంది. అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు సూపర్ మార్కెట్ బాధ్యతలు నువ్వే చూసుకుంటున్నావని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇషిక పూజ చేస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |